ఎంతమంది బలవ్వాలిసార్?

కన్నీటి పర్యంతమైన మహిళా కండక్టర్లు


ఆదిలాబాద్ :  ఇప్పటివరకు 19 మంది బలిదానాలు చేసుకున్నా సీఎం కేసీఆ లో చలనం లేదు. ఇంట్లోని ఆడవాళ్లను కోల్పోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో కేసీఆర్‌కు తెలియనట్లుంది. చిన్న పిల్లల తల్లులైన మా సోదరిమ ణులు ముఖ్యమంత్రి అవమానపరిచేలా మాట్లాడడం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకెంతమం ది బలైతే మీరు స్పందిస్తారో చెప్పండి సార్.. అంటూ మహిళా కండక్టర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సతుపలి, హుస్నాబాద్ డిపోలో పనిచేసే మహిళాకం డక్టర్ల ఆత్మహత్యల నేపథ్యంలో మంగళవారం ఆదిలా బాద్ జిల్లా కేంద్రంలో సంతాప ర్యాలీ నిర్వహించారు. స్థానిక సుందరయ్య భవన్ నుంచి డిపో వరకు ర్యాలీగా వచ్చిన మహిళలు ఆద్యంతం ఆవేదనతో కన్నీటి పర్యం తమయ్యారు. వారి మృతికి సంతాప సూచకంగామౌనం పాటించి నివాళి అర్పించారు. ఈ సంద ర్భంగా పలువురు మహిళా కండక్టర్లు మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల కోసం తాము సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి తిన్నదరగక సమ్మె చేస్తున్నారనడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. తాము తిన్నదరగక చేస్తుంటే తిన్నది అరిగేదాక మాట్లాడుతున్నావే తప్ప ఏం చేస్తున్నావని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని గవర్నమెంట్ లో విలీనం చేసేవరకు వెనకడు గువేసేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులు పాల్గొన్నారు.